e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News ఏప్రిల్ నెలలో13.73 శాతం పెరిగిన ఈ.పి.ఎఫ్.ఓ. సబ్స్క్రైబర్స్ …

ఏప్రిల్ నెలలో13.73 శాతం పెరిగిన ఈ.పి.ఎఫ్.ఓ. సబ్స్క్రైబర్స్ …

ఏప్రిల్ నెలలో13.73 శాతం పెరిగిన ఈ.పి.ఎఫ్.ఓ. సబ్స్క్రైబర్స్ …

ఢిల్లీ ,జూన్ 21: ఏప్రిల్‌ నెలలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈ.పి.ఎఫ్.ఓ) 12.76 లక్షల చందాదారులను చేరినట్లు ఈ.పి.ఎఫ్.ఓ. తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నప్పటికీ 2021 ఏప్రిల్ నెలలో 13.73 శాతం చందాదారుల పెరుగుదల నమోదైంది. మార్చినెలతో పోలిస్తే, 2021 ఏప్రిల్ నెలలో, 11.22 లక్షల మేర చందాదారులను పేరోల్‌ కు చేర్చారు. 2021 ఏప్రిల్ నెలలో నిష్క్రమణల సంఖ్య 87,821 మేర తగ్గగా, 2021 మార్చి నెలతో పోలిస్తే తిరిగి చేరిన సభ్యుల సంఖ్య 92,864 మేర పెరిగినట్లు పెరోల్ డేటా వివరాలు తెలియజేస్తున్నాయి.

ఈ నెలలో చేరిన 12.76 లక్షల నికర చందాదారులలో, 6.89 లక్షల మంది కొత్త సభ్యులు, మొదటిసారి, ఈ.పి.ఎఫ్.ఓ. కి చెందిన సామాజిక భద్రత పరిధిలోకి వచ్చారు. సుమారు 5.86 లక్షల మంది నికర చందాదారులు ఈ.పి.ఎఫ్.ఓ. నుంచి నిష్క్రమించి, తరువాత ఈ.పి.ఎఫ్.ఓ. పరిధిలోని సంస్థల్లో ఉద్యోగాల్లో చేరడం ద్వారా ఈ.పి.ఎఫ్.ఓ. పరిధిలోకి తిరిగి వచ్చారు.

- Advertisement -

పే రోల్ డేటాను వయస్సు వారీగా పోల్చి చూస్తే, 22-25 సంవత్సరాల మధ్య వయస్సు వారు 2021 ఏప్రిల్ నెలలో అత్యధిక సంఖ్యలో సుమారు 3.27 లక్షల మంది సభ్యులు కొత్తగా నమోదయ్యారు. ఆ తర్వాత, 29-35 మధ్య వయస్సు గలవారు 2.72 లక్షల మంది సభ్యులుగా నమోదవ్వగా.. 18-25 మధ్య వయస్సు గల వారు, సాధారణంగా ఉద్యోగంలో మొదటి సారి చేరినవారై ఉంటారు. 2021 ఏప్రిల్‌ నెలలో చేరిన మొత్తం నికర చందాదారులలో వీరు 43.35 శాతంగా ఉన్నారు.

పే రోల్ గణాంకాల వివరాలను రాష్ట్రాల వారీగా పోల్చి చూస్తే, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సంస్థలు, ఈ నెలలో సుమారు 7.58 లక్షల మంది సభ్యులను చేర్చుకోవడం ద్వారా ముందంజలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో అన్ని వయసుల వారి మొత్తం నికర పే రోల్ చేరిక 59.41 శాతంగా నమోదయ్యింది. గత నెలతో పోల్చితే ఈశాన్య రాష్ట్రాలు నికర చందాదారుల చేరికలో సగటు వృద్ధిని నమోదు చేశాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏప్రిల్ నెలలో13.73 శాతం పెరిగిన ఈ.పి.ఎఫ్.ఓ. సబ్స్క్రైబర్స్ …
ఏప్రిల్ నెలలో13.73 శాతం పెరిగిన ఈ.పి.ఎఫ్.ఓ. సబ్స్క్రైబర్స్ …
ఏప్రిల్ నెలలో13.73 శాతం పెరిగిన ఈ.పి.ఎఫ్.ఓ. సబ్స్క్రైబర్స్ …

ట్రెండింగ్‌

Advertisement