ENG vs SA | టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా షార్జాలో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ముందు ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు దూకుడు చూపించారు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (2) విఫలమైనప్పటికీ.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (34) ఆకట్టుకున్నాడు. ఇక హెండ్రిక్స్ ఔట్ కావడంతో బ్యాటింగ్‌కు దిగిన వాండర్ డస్సేన్ (94) చెలరేగాడు. ఆరు సిక్సులు, ఐదు ఫోర్లతో భారీ స్కోర్‌ను సాధించాడు. డికాక్ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ (52)తో హాఫ్ సెంచరీతో రాణించాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 189 పరుగులు చేశారు.