Viral Video : పానీపూరీ గురించి తెలియని వారు ఉండరు. రోడ్డు పక్కన పానీపూరీ బండి కనిపిస్తే చాలు తినకుండా వెనక్కిరారు. అయితే, గోల్గప్పాని మనుషులే కాదు జంతువులు కూడా ఇష్టంగా తినడం విశేషం. ఇటీవల ఆవు, దూడ పానీ పూరీ తింటూ అందరి ఆశ్చర్య పరిచాయి. ఇప్పుడు ఓ ఏనుగు గోల్గప్పా తింటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఆస్సాంలోని తేజ్పూర్ వద్ద రోడ్డు పక్కన ఉన్న పానీ పూరీ బండి వద్ద ఓ ఏనుగు పానీ పూరీ తింటూ కనిపించింది. ఓ వ్యక్తి పూరీలోకి పానీ నింపి తొండానికి అందిస్తుంటే.. ఏనుగు వాటిని ఎంజాయ్ చేస్తూ తింటోంది. ఇది గమనించిన స్థానికులు ఏనుగును చుట్టుముట్టి ఫొటోలు, వీడియోలు తీసి ఇంటర్నెట్లో పెట్టేశారు. అది కాస్తా వైరల్గా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఏనుగు పానీ పూరీని ఎలా
ఎంజాయ్ చేస్తూ తింటోందో మీరూ ఓ లుక్కేయండి.
Elephant enjoying pani puri in Guwahati.#guwahati #elephant #panipuri pic.twitter.com/AJz3RVwlBa
— Trolls Officials (@trollsofficials) October 12, 2022