e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News వృద్ధ దంప‌తుల‌ను రూ 5 కోట్ల‌కు ముంచిన నిందితుల అరెస్ట్

వృద్ధ దంప‌తుల‌ను రూ 5 కోట్ల‌కు ముంచిన నిందితుల అరెస్ట్

న్యూఢిల్లీ : పెట్టుబ‌డికి రెండింత‌లు లాభాలు ఇస్తామ‌ని ఆశ‌చూపుతూ వృద్ధ దంప‌తుల‌ను రూ 5.24 కోట్ల‌కు మోస‌గించిన ఇద్ద‌రు నిందితుల‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల‌ను అంకిత్ ఠాకూర్ (29), వినోద్ ఆర్య (28)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం వృద్ధ దంప‌తులు విదేశాల్లో ఉన్న పిల్ల‌ల వ‌ద్ద సెటిల్ అయ్యే ఆలోచ‌న‌తో ద్వార‌కాలో ఉన్న మూడు ఫ్లాట్ల‌ను విక్ర‌యించారు.

ఈ విష‌యం ప‌సిగ‌ట్టిన మ్యూచ్‌వ‌ల్ ఫండ్ కంపెనీలో ప‌నిచేసే నిందితులు ఠాకూర్‌, ఆర్య వారిని సంప్ర‌దించారు. తాము కొత్త‌గా ప్రారంభించిన వెబ్‌సైట్‌లో పెట్టుబ‌డి పెడితే మూడేండ్ల‌లో రెట్టింపు లాభాలు ఇస్తామ‌ని వృద్ధ జంట‌ను ప్ర‌లోభ‌పెట్టారు. నిందితుల‌ను న‌మ్మిన బాధితులు తాము ద్వార‌కాలో ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌గా వ‌చ్చిన రూ 5.24 కోట్ల‌ను వారికి అప్ప‌గించారు. సెక్యూరిటీగా నిందితులు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావ‌డంతో నిందితులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా ఈ వ్య‌వ‌హారం వెలుగుచూసింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement