బుద్ధిమంతునివని గద్దెనెక్కిస్తే
పీతిరి గద్దలెక్క కుల్లబొడిస్తివి
అండగుంటవని పగ్గాలు ఇస్తే
నెత్తి మీదికెక్కి సవారీ జేస్తివి
ఆదరిత్తవని ఆశ పెట్టుకుంటే
అందినకాడికి దోచుకతింటివి
బతుకు దీపం వెలిగిత్తవనుకుంటే
మతం మంటలను ఎగదోస్తివి
జాతి సంపద అంతటిని
కార్పొరేట్లకు దానమిస్తివి
మెతుకు దేశం చేస్తవంటే
ఆకలి రాజ్యంగా మారిస్తివి
సుసంపన్న భారతదేశాన్ని
అంగడిలో అమ్మకం పెడ్తివి
ఓయ్ సామ్రాజ్యవా(మో)దీ!
ఏదైనా చెల్లుబాటని తలచి
ఇష్టారాజ్యాంగా పాలిస్తుంటే
ఉప్పొంగి జేజేలు కొట్టేందుకు
జనం నీ భజన బృందం కాదు
నియంతల తరిమి కొట్టినోల్లు
దోపిడీ పీఠాల కూలదోసినోళ్లు
నువ్వు పూచిక పుల్ల చందమే!
ఇకనైనా సోయి దెచ్చుకుని
స్వంత ఎజెండా పక్కనెట్టి
జనహిత పాలన సాగించు
కాదని పాత దారిలో నడిస్తే
లంకాధీశుడు గొటబాయకు
పట్టిన గతి నీకు తప్పదు సుమీ!
-కోడిగూటి తిరుపతి
95739 29493