దేశానికి మనిషి నిచ్చెన కావాలి
దేశానికొక దారిదీపం కావాలి
రైతుల చెమటను పంచుకునే
శ్రామిక హృదయం కావాలి
దేశోద్ధారకుడు కావాలి
ఆ దేశోద్ధారకుడే కేసీఆర్
రావాలి
చెరువు కట్టమీద పాలపిట్టయి..
మాట్లాడాలి ప్రజల గొంతుకై..
సమతత్వం
హిమశిఖరమెత్తున నిలిపే నాయకుడు
పల్లానికే ప్రవహించే నీటికి
ఎదురీత నేర్పిన ఆధునిక ఇంజినీర్
దేశాన్ని ముందుకునడిపే దేశోద్ధారకుడు!
రాష్ర్టాల గొంతు మీద గొడ్డలి
స్వేచ్ఛా కాళ్లకు సంకెళ్లూ చేతల్ల పూలు
కవ్వించే బుల్డోజర్లు కనురెప్ప తెరిస్తే జీఎస్టీలు
విద్వేషకుల పన్నాగాలు అరాచక ఆగడాలు
దుష్ట చతుష్టయాలకు ముగింపు పలకాలి
తంగేడు పువ్వు రాష్ర్టానికి చిహ్నమైనట్లు
దేశానికి నీ పిలుపు ముఖచిత్రం కావాలి
కొత్త చూపునివ్వాలి
సమస్త వనరులతో సకల సంపదలతో
దేశం సీటి గొట్టాలి
కేసీఆర్.. మూడక్షరాల అగ్నిపథం
రాజకీయ యుద్ధ పతాక
ప్రపంచ పటంలో
దేశ ఔన్నత్యాన్ని నిలిపే ధీమంతుడు
-వనపట్ల సుబ్బయ్య
94927 65358