ఉ: రైతుకు మేలు జేయుటకు రాష్ట్ర ప్రభుత్వము
రైతు బంధునున్
కోతలు కోయు యంత్రములు కుప్పలు
నూర్పిడి జేయు యంత్రముల్
శీతలమైన షెడ్డులను శ్రేష్ఠపు విత్తన మెర్వులన్నియున్
రైతుకు నన్నివేళల సరైన విధానము నందజేయుచున్!
పంచచామరము:
విరామ మెర్గకుండ నిచ్చె వేడ్కతో కరంటునూ
నిరంతరమ్ము నల్లతోటి నీటి నిచ్చెదూపకై
తరాల మార్పు గోరి పట్టదారు పుస్తకాలతో
స్వరాష్ట్రమందు మార్పుదెచ్చి సాగుచుండె ముందుకున్!
కం: రూపాయి కిలో బియ్యము
సాపాటుగ పించనిచ్చె సమభావముతో
చే పట్టె డబుల్ బెడ్ రూం
మా పాలిట కేసియారు మాన్యుండయ్యెన్!
మత్తకోకిల:
విత్తమార్జన జేయ కొత్తగ వేలకంపిను లొచ్చెరా
చిత్తమందున రాష్ట్ర వృద్ధికి సేవజేసెడి భావనల్
సత్త జూపుచు నన్నిశాఖలు సాగు చుండెను ముందుకున్
కొత్త రాష్ట్రము నందు తీరెను కోర్కెలన్నియు భేషుగా!
కం: కేజీటూ పీజియనుచు
భూ జను లందరికి విద్య పూనిక నొసగన్
రోజూ సమీక్ష జేయుచు
రాజీ లేకుండ నిడెడు రాజాతండే!
కం: ధరణీ పోర్టల్ జేసియు
నిరతమ్ముగ సాగు భూమి నిమిషము లోనన్
తెరపై కంప్యూటర్ లో
తరచుగ వీక్షించి రైతు తన్మయ మొందన్!
కం: వృద్ధాప్య పింఛనమలు
శ్రద్ధగ నారోగ్య సేవ శ్రమయెంతైనన్
మద్దతు ధర పంటలకును
విద్దెకు నింగ్లీషు చదువు వేడ్కగ జేసెన్!
కం: మాటకు ప్రాణము నిచ్చును
పాటకు పద్యమ్మునకును పరవశమొందున్
బూటక మెరుగని వాడుగ
సాటెవ్వరు కేసియారు సమభావమునన్!
కం: యువతకు నుద్యోగమ్ములు
కవులకు సత్కారములను ఘనముగ జేయున్
వ్యవసాయమ్ముకు నండగ
భవితకు మార్గంబు జూపు భాగీరథుడున్!
సీ:యాదాద్రి కోవెల యద్భుతమ్ముగ గట్ట
తెలగాణ కీర్తికి తేజ మయ్యె
కాళేశ్వరమ్మును ఘనముగా నిర్మించి
వ్యవసాయ వృద్ధిలో వరలు చుండె
విశ్రాంతి లేకుండ విద్యుత్తు నిచ్చెడి
యేకైక రాష్ట్రంబు ప్రాకటముగ
గంగ జమున వంటి ఘనమైన తహజీబు
నిలిపి చంద్రుడే నిక్కముగను
తే.గీ:
వరము షాదీ ముభారఖు వధువు కిపుడు
రైతు క్షేమము గోరెటి రైతు బంధు
నిత్య కళ్యాణ లక్ష్మితో నేస్తమయ్యి
రమ్య మాయెను తెలగాణ రాష్ట్ర ప్రగతి
రమ్య మాయెను తెలగాణ రాష్ట్ర సమితి
– డాక్టర్ మహ్మద్ షరీఫ్,
98665 60527