Eating raw vegetables | ఏ సీజన్లో అయినా కూరగాయలను పచ్చిగానే తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అయితే, వానాకాలంలో మాత్రం కాస్తా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈ సీజన్లో రకరకాల వ్యాధులు పొంచివుంటాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అయితే ఈ సీజన్లో దాదాపుగా ఏ వ్యాధి అయినా కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్లనే వస్తుంటుంది. అందుకని మనం తినే ఆహారాన్ని, తాగే నీటిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పచ్చి కూరగాయలు తినొచ్చని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు.
వానాకాలంలో మొక్కలు, ఆకులపై హానికారక సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా తిష్ఠవేసి ఉంటాయి. ఆకుకూరలపై వీటి మనుగడ ఎక్కువకాలం ఉంటుంది. ఒకవేళ ఆకుకూరలు తినాలనుకుంటే మాత్రం 30 నిమిషాల పాటు ఉడికించాల్సిందే.
మొలకెత్తిన ధాన్యం ఆరోగ్యానికి మంచివే. కానీ, వానాకాలంలో వీటిని డైరెక్ట్‌గా తినకూడదు. తింటే మాత్రం పలు వ్యాధులకు గురవుతారు.
వానాకాలంలో ఈగలు, దోమలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కూరగాయలపై బ్యాక్టీరియా, వైరస్ ఉండి మనకు హాని చేస్తాయి.
మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను వంట చేయడానికి ముందు కాస్సేపు ఎండలో పెట్టడం చాలా మంచిది.
ఏ ఆహారం అయినా తినాలనుకుంటే తప్పనిసరిగా బాగా ఉడికించాలి. లేనిపక్షంలో వీటిపై ఉండే బ్యాక్టీరియా, వైరస్లు మనకు హానిచేస్తాయి.
వానాకాలంలో జంక్ ఫుడ్ అసలే తినకూడదు.
వానాకాలంలో పచ్చి ఆకుకూరలు, వంకాయ, క్యాప్సికం, కాలిఫ్లవర్లను అసలే తినకూడదు. అయితే, పొట్లకాయ, కాకరకాయ, బూడిద పొట్లకాయ, బెండకాయ, సొరకాయలను నిరభ్యంతరంగా తినొచ్చు. దోసకాయలు, టమాట, బీన్స్, ఓక్రా కూడా ఒంటికి మంచివే.