హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలోని హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ (హెచ్సీడీసీ)లో ఉచిత ఎంసెట్ ఇంజినీరింగ్ కెరీర్ కౌన్సెలింగ్ అందించనున్నట్లు హెచ్సీడీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె స్టీవెన్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఇంజినీరింగ్ కళాశాలలో అసెంబ్లీ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఎంసెట్ రాసిన విద్యార్థులు.. కోర్సులు, కళాశాలలు ఎంపిక చేసుకునేందుకు వీలుగా కోర్సుల వారీగా అవకాశాలను వివరిస్తామన్నారు. విద్యార్థులు వారి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఎంసెట్ కన్వీనర్, జేఎన్టీయూ ప్రొఫెసర్ గోవర్ధన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రితో పాటు పలు రంగాల నిపుణులు హాజరవుతారని వివరించారు.