శ్రీకాంత్ పరకాల, శివ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఈ3 విత్ లవ్’. ఏవీఎన్ రావ్ సమర్పణలో వాయుపుత్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. దీక్షిత్ కోడెపాక దర్శకుడు. ఆదివారం హైదరాబాద్లో ప్రార ంభమైంది. దర్శకుడు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ…‘ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ ఇది. ఈ నెల 10వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : నగేష్ పీకే, సినిమాటోగ్రఫీ : అల్లాడి ప్రణవ్ చంద్ర.