అతడొక హాలీవుడ్ స్టార్ హీరో.. యాక్టింగ్ మాత్రమే కాదు..కండలు తిరిగిన దేహంతో రెజ్లర్‌గా రింగ్‌లోకి దిగితే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. యాక్టింగ్‌లోనూ, రెజ్లింగ్‌లోనూ తన మార్కును చూపిస్తూ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు డ్వానే జాన్సన్. ఎప్పుడూ ఏదో ఒక వృత్తిపరమైన కమిట్మెంట్స్ తో బిజీగా ఉండే ఈ యాక్టర్ ఇపుడు తన గారాల కూతురితో సరదాగా ఆడుకుంటున్నాడు. రెండున్నరేళ్ల కూతురు టియానాకు పాజిటివ్ మోటివేషన్ ఇస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
డ్వానే జాన్సన్ కూతురు టియానాను ఎత్తుకొని..నేను అందమైన అమ్మాయిని అని చెప్తావా..? అంటూ అడిగాడు…దానికి టియానా కష్టపడుతూ ఐ యామ్ ఏ ప్రెట్టీ గాళ్ అంటూ చెప్పింది. నువ్వు చాలా తెలివైన అమ్మాయి, నేను ఏదైనా చేయగలను అని చెప్పే కంటే ముందు.. డాడీ ఈజ్ ది బెస్ట్ అని చెప్పమని అడిగాడు జాన్సన్. టియానా అమ్మా అని అరవడానికి ముందు తండ్రిని చిట్టిపొట్టి మాటలతో ప్రశంసించింది. డ్వానే జాన్సన్ కూతురు టియానాకు నేర్పిస్తున్న మాటలకు సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.