ఐదు దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ లెజెండరీ యాక్టర్లలో ఒకరిగా నిలిచారు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty). ఈ స్టార్ హీరోకు తగ్గ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ లీడింగ్ హీరోగా నిలిచాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఇటీవలే సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు దుల్కర్. తన తొలి సంపాదన రూ.2 వేలు అని చెప్పాడు దుల్కర్ సల్మాన్.
ఓ చిట్ చాట్ సెషన్లో మాట్లాడుతూ..’పదేళ్ల వయస్సులో తొలి సంపాదన (first paycheck)గా రూ. రూ.2 వేలు అందుకున్నా. ఇది నెపోటిజమ్ వల్ల ప్రయోజనం పొందినది కాదు. నన్ను టీవీ కమర్షియల్‌కు యాదృఛ్చికంగా ఎంపిక చేశారు. టీవీ ఛానల్ వాళ్లు యాడ్‌లో పిల్లలను ఎంపిక చేసేందుకు మా స్కూల్‌కు వచ్చారు. టీవీ కమర్షియల్ యాడ్‌కు ఎంపికైన వారిలో నేనూ ఒకడిని. యాడ్‌లో అవకాశం వచ్చేందుకు నాన్న నుంచి ఎలాంటి సహాయం తీసుకోలేదని’ చెప్పుకొచ్చాడు.
దుల్కర్ నటించిన Chup: Revenge Of An Artist సెప్టెంబర్ 23న విడుదలైంది. సన్నీలియోల్, శ్రేయా ధన్వంతరీ, పూజా భట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్ బాల్కీ డైరెక్ట్ చేశాడు.