హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్‌శాఖకు చెందిన మరో మహిళా అధికారి అంతర్జాతీయస్థాయిలో సేవలందిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి (యూఎన్) మిషన్‌లో భాగంగా తెలంగాణ సీఐడీ విభాగానికి చెందిన డీఎస్పీ సీతారెడ్డి దక్షిణ సూడాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే అక్కడ విధుల్లో చేరిన సీతారెడ్డి మరికొంత కాలం దక్షిణ సూడాన్‌లోని జుబాలో ట్రైనింగ్ సెన్సిటైజేషన్ యూనిట్లో పనిచేయనున్నారు. భారత్‌లోని వివిధ రాష్ర్టాల పోలీస్ విభాగాల నుంచి మొత్తం 24 మంది అధికారులు ఈ మిషన్ కోసం పనిచేస్తున్నారు.