Dosti video song | కొన్ని చోట్ల ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ సందడి అలాగే ఉంది. ఇప్పటికి ఈ చిత్ర కలెక్షన్లు కొన్ని ఏరియాలలో స్టడీగానే ఉన్నాయి. ప్రస్తుతం టిక్కెట్ రేట్లు కూడా తగ్గడంతో ఆడియెన్స్ రిపీటెడ్‌గా ఈ చిత్రాన్ని చూస్తున్నారు. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. నైజాంలో 100కోట్ల షేర్‌ను సాధించిన మొదటి సినిమాగా ట్రిపుల్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1100కోట్లను కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడంలో పాటలకు కూడా కొంత వరకు క్రెడిట్ దక్కుతుంది.
ఎమ్ఎమ్. కీరవాణి స్వర పరిచిన పాటలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇటీవలే చిత్రం నుంచి విడుదలైన ‘కొమ్మ ఉయ్యాలా’, ‘నాటు నాటు’ వీడియో సాంగ్స్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలోని ‘దోస్తీ’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాటను కాల భైరవ ఆలపించాడు. తారక్, చరణ్‌ల స్నేహాన్ని రాజమౌళి ఈ పాటలో అద్భుతంగా చూపించాడు. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించగా తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించగా ఆలీయాభట్, ఒలీవియా మొర్రిస్లు కథానాయికలుగా నటించారు.