e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News Oxygen supply : ఇంటి వ‌ద్ద‌కే ప్రాణ‌వాయువు.. డొనేట్ కార్ట్ ఉదార‌త‌

Oxygen supply : ఇంటి వ‌ద్ద‌కే ప్రాణ‌వాయువు.. డొనేట్ కార్ట్ ఉదార‌త‌

Oxygen supply : ఇంటి వ‌ద్ద‌కే ప్రాణ‌వాయువు.. డొనేట్ కార్ట్ ఉదార‌త‌

Oxygen supply | క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండం చేస్తున్న స‌మ‌యంలో వేలాది మందికి భ‌రోసాగా మారారు. 1500 స్వచ్ఛంద సంస్థలకు వారధిగా మారి క‌రోనా కాలంలో ఏకంగా రూ.55 కోట్లు స‌మ‌కూర్చారు. రోగుల‌కు కావాల్సిన వైద్య సామాగ్రిని అందించారు. ఇప్పుడు సెకండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ స‌మ‌స్య వేధిస్తుండ‌టంతో దాని సప్లైకి న‌డుం బిగించారు. ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఉన్న వారికి ఇంటి వ‌ద్ద‌కే వెళ్లి ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్స్‌తో పాటు వైద్య ప‌రిక‌రాల‌ను అందిస్తున్నారు. వాళ్లే డొనేట్ కార్ట్ ( DONATE KART ) స‌భ్యులు. ఇందులో భాగంగా సైబ‌రాబాద్ పోలీసులు, సొసైటీ ఫ‌ర్ సైబ‌రాబాద్ కౌన్సిల్‌తో ఒప్పందం కూడా చేసుకున్నారు.

Oxygen supply : ఇంటి వ‌ద్ద‌కే ప్రాణ‌వాయువు.. డొనేట్ కార్ట్ ఉదార‌త‌

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు వార‌థిగా..

దాతలు చేస్తున్న సాయం.. భాదితులకు సక్రమంగా అందుతుందా అన్న అనుమానాలు తలెత్తకుండా హైదరాబాద్‌కు చెందిన సందీప్‌ కుమార్‌, అనిల్ డొనేట్ కార్ట్ పేరిట ఈ ఆన్‌లైన్ వేదిక‌ను ప్రారంభించారు. నాగ్‌పూర్ ఐఐటీలో చ‌దివిన వీరు ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌తో క‌లిసి ప‌నిచేశారు. ఆ సమయంలో పలువురు దాతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అంతేగాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందుకు వచ్చే దాతలు.. వారిచ్చే సామగ్రిపై ఆరా తీశారు. స్వచ్ఛందంగా పని చేసేందుకు అనేక ఎన్‌జీవోలు ఉన్నాయని గుర్తించిన వారు ఓ ఆలోచన చేశారు. గచ్చిబౌలిలోని కార్యాలయం తెరిచి https://WWW.donatekart.com వెబ్‌సైట్‌ను రూపొందించారు. దేశవ్యాప్తంగా ఉన్న‌ 1500 స్వచ్ఛంద సంస్థలను ఇందులో చేర్చి వాటికి వార‌థిగా మారారు.

Oxygen supply : ఇంటి వ‌ద్ద‌కే ప్రాణ‌వాయువు.. డొనేట్ కార్ట్ ఉదార‌త‌
మంత్రి కేటీఆర్ నుంచి అవార్డు అందుకుంటున్న డొనెట్ కార్ట్ వ్య‌వ‌స్థాప‌కులు (ఫైల్)

సాయం కావాలంటే ఏం చేయాలి

ఎవరైనా దాతల సాయం కావాలనుకుంటే ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని వారికి కావాల్సిన అవసరాన్ని వివరించాలి. అప్పుడు వారి విజ్ఞప్తిని ఎన్‌జీవోలు, దాతలు పరిశీలించి నేరుగా వెళ్లి సాయం చేస్తారు. ఇలా నాలుగేండ్లలో దాదాపు రూ.70 కోట్ల క్రౌడ్‌ ఫండింగ్‌ సమకూర్చి నిస్సాహాయులు, పేదలు, నిరాశ్రయులకు లబ్ధి చేకూర్చారు. కేవలం కొవిడ్‌ పంజా విసిరిన కాలంలోనే రూ. 55 కోట్ల క్రౌడ్‌ ఫండింగ్‌తో అనేక వర్గాలకు సాయం చేశారు. దీంతో డొనేట్‌ కార్ట్‌ వ్యవస్థాపకుల కృషిని గుర్తించిన నాస్కామ్‌ 2018లో ఇన్నోవేషన్‌ అవార్డుకు ఎంపిక చేయగా.. మంత్రి కేటీఆర్‌ వారికి అందజేశారు.

Oxygen supply : ఇంటి వ‌ద్ద‌కే ప్రాణ‌వాయువు.. డొనేట్ కార్ట్ ఉదార‌త‌

హెల్ప్‌ ఇన్‌ నీడ్‌కు నేరుగా సాయం..

ప్రాణవాయువు కావాలని కోరుతూ మా వెబ్‌సైట్‌లో అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. వాటిని అందించేందుకు మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఐసొలేషన్‌లో ఉన్న వారికి 200 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందించాం. సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ సైబరాబాద్‌తో కలిసి ప్రభుత్వ దవాఖానల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు కాన్సన్‌ట్రేటర్లు అందించేందుకు క్రౌడ్‌ ఫండింగ్‌ మొదలు పెట్టాం. దాతలతో పాటు సాయం పొందిన వారి వివరాలను మా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నాం. ఎవరైనా సాయం చేయాలనుకుంటే మా వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా బాధితులను చేరుకోవచ్చు.
-సందీప్‌ కుమార్‌, డొనేట్‌ కార్ట్‌ వ్యవస్థాపకుడు

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ఒక్క మాస్క్ స‌రిపోదా? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాలా?

Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్‌ లెవల్స్ పెంచుకోండి

Vaccine Doubts : క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిందేనా? ఒక్క డోస్ స‌రిపోదా?

బోర్లా ప‌డుకుంటే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరుగుతాయా.. ఆ వైర‌ల్ వీడియోలో నిజ‌మెంత‌?

Corona effect : ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ఎలా పెంచుకోవాలి

Children Health : క‌రోనా టైంలో మీ పిల్ల‌లు మానసికంగా కుంగిపోకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Oxygen supply : ఇంటి వ‌ద్ద‌కే ప్రాణ‌వాయువు.. డొనేట్ కార్ట్ ఉదార‌త‌

ట్రెండింగ్‌

Advertisement