e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News ఆస్ట్రాజెన్‌కా టీకాను తీసుకోండి : సౌమ్యా స్వామినాథ‌న్

ఆస్ట్రాజెన్‌కా టీకాను తీసుకోండి : సౌమ్యా స్వామినాథ‌న్

ఆస్ట్రాజెన్‌కా టీకాను తీసుకోండి : సౌమ్యా స్వామినాథ‌న్

జెనీవా: ఆక్స్‌ఫ‌ర్డ్‌, ఆస్ట్రాజెన్‌కా త‌యారు చేస్తున్న కోవిడ్ టీకాకు చాలా వ‌ర‌కు యూరోప్ దేశాలు నిషేధించాయి. ఆ టీకాను వేసుకోవ‌డం లేద‌ని ఇప్ప‌టికే కొన్ని దేశాలు స్ప‌ష్టం చేశాయి.  ఆస్ట్రాజెన్‌కా టీకా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం గ‌డ్డ‌క‌డుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్ ఓ సూచ‌న చేశారు.  ప్ర‌స్తుతం ఆస్ట్రాజెన్‌కా టీకాను వాడుతూనే ఉండాల‌ని ఆమె తెలిపారు.  ఆస్ట్రాజెన్‌కా టీకా వినియోగంపై పూర్తి స్థాయిలో స‌మీక్ష చేస్తున్నామ‌ని, ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆందోళ‌న‌కు గురికావొద్దు అని ఆమె తెలిపారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో.. అన్ని దేశాలు ఆస్ట్రాజెన్‌కా టీకాను తీసుకోవ‌డం ఆప‌వ‌ద్దు అంటూ ఆమె త‌న సూచ‌న‌ల్లో తెలిపారు. ఆస్ట్రాజెన్‌కా టీకాను తీసుకుంటూనే ఉండాలంటూ సౌమ్యా స్వామినాథ‌న్ త‌న ట్వీట్‌లో తెలిపారు.  ఏ వ్యాక్సిన్ అయినా లేక మందు అయినా.. వంద శాతం సుర‌క్షితంగా ఉండ‌వ‌న్నారు.  ల‌క్ష‌ల్లో ఎవ‌రో ఒక‌రికి ఏదో ఒక‌టి జ‌రుగుతుంద‌ని, కానీ ల‌క్ష‌ల మందిని చంపేస్తున్న వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు టీకా అవ‌స‌ర‌మ‌న్నారు.   మ‌రోవైపు ఇవాళ డ‌బ్ల్యూహెచ్‌వోకు చెందిన ప్ర‌త్యేక బృందం.. ఆస్ట్రాజెన్‌కా వినియోగంపై స‌మీక్ష చేయ‌నున్న‌ది. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆస్ట్రాజెన్‌కా టీకాను తీసుకోండి : సౌమ్యా స్వామినాథ‌న్

ట్రెండింగ్‌

Advertisement