క్యూట్ క్యూట్‌గా ఉన్న ఈ శునకం పేరు టోబీకీత్. అమెరికాకు చెందిన గిసెల్లా షోర్ అనే మహిళ దీన్ని పెంచుకుంటున్నారు. ఇది అనాయింట్స్ చినుహుహా జాతికి చెందినది. అయితే ఏంటటా అనే కదా మీ ప్రశ్న.. అక్కడికే వస్తున్నాం.. ఈ శునకం ఇప్పుడు గిన్నెస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రాణాలతో ఉన్న అత్యధిక వయసు కలిగిన శునకంగా ఇది రికార్డు సాధించింది. దీని వయసు 21 ఏండ్ల 66 రోజులు.