టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) కాంబినేషన్లో వస్తున్న చిత్రం డాక్టర్ జీ (Doctor G). ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది డాక్టర్ జీ. జంగిల్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సీబీఎఫ్సీ ఈ చిత్రానికి జీరో కట్స్ (ఎలాంటి కట్స్ లేకుండా) తో ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. కథ వల్లే సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీచేసిందట. డాక్టర్ జీలో ఆయుష్మాన్ ఖురానా గైనకాలజిస్ట్‌గా నటిస్తున్నాడు. రకుల్ ప్రీత్‌సింగ్ డాక్టర్ ఫాతిమా పాత్రలో నటిస్తోంది. షఫాలీ షా, షీబా చద్దా కీ రోల్స్ పోషిస్తున్నారు.
పాపులర్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ సోదరి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు క్యాంపస్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి సుమిత్ సక్సేనా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్..సినిమా ఫన్నీగా సాగుతూ మూవీ లవర్స్ కు కావాల్సిన వినోదాన్ని అందించడం ఖాయమని చెబుతోంది.
Read Also : Trivikram Srinivas | త్రివిక్రమ్ మొదటి సినిమా స్పెషల్ షో..వివరాలివే..!
Read Also : Ram Charan | రాంచరణ్ కొత్త లుక్ వైరల్..నెటిజన్లు ఇంప్రెస్
Read Also : Simbu | ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థలో.. శింబు భారీ బడ్జెట్ సినిమా?