బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana), టాలీవుడ్ (Bollywood) భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కాంబినేషన్లో వచ్చిన చిత్రం డాక్టర్ జీ (Doctor G). గత శుక్రవారం (అక్టోబర్ 14న) ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా మంచి కలెక్షన్లు వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్లో రూ.15.03 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ సర్కిల్ సమాచారం.పెద్దగా సినిమాలేవి లేకపోవడంతో ఈ వారంలో కూడా మంచి వసూళ్లు రావడం ఖాయమని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. జంగిల్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో షఫాలీ షా, షీబా చద్దా కీలక పాత్రల్లో నటించారు.
అనుభూతి కశ్యప్ దర్శకత్వంలో క్యాంపస్ కామెడీ డ్రామాగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సుమిత్ సక్సేనా డైలాగ్స్ అందించారు .
Read Also :Vikram 61 | విక్రమ్ 61 అప్డేట్.. రష్మిక స్థానంలో సోషల్ మీడియా సెన్సేషన్..!
Read Also : Nithiin | క్రేజీ టాక్.. నితిన్‌తో భీమ్లానాయక్ డైరెక్టర్ చర్చలు..?
Read Also : Priyamani DR56 look | ప్రియమణి DR56 ఫస్ట్ లుక్.. లాంఛ్ చేసిన విజయ్ సేతుపతి
Read Also : Ritika nayak | బార్బీ డాల్‌లా రితికా నాయక్ ట్రాన్స్ ఫార్మేషన్.. ట్రెండింగ్‌లో వీడియో