పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న మలయాళ స్టార్ హీరోల్లో ఒకడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఈ టాలెంటెడ్ హీరో సినిమాలకు మాతృక భాషలోనే కాకుండా ఇతర భాషల్లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇటీవలే హను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చిన సీతారామం సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు దుల్కర్ సల్మాన్. రెండో వారంలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఓ మీడియా పోర్టల్‌తో చిట్ చాట్ చేశాడు.
ఈ సెషన్లో తన ఫేవరేట్ తెలుగు యాక్టర్ ఎవరో చెప్పాడు దుల్కర్. ఇంతకీ ఈ హీరో ఎవరి పేరు చెప్పాడో ఊహించారా..? ఈ ఏడాది పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన అభిమాన తెలుగు హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అని వెంటనే రిప్లై ఇచ్చాడు దుల్కర్. ఇదే ప్రశ్న హీరోయిన్ మృణాళ్ ఠాకూర్‌ను అడిగితే విజయ్ దేవరకొండ అని చెప్పింది.
దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం క్రైం థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చుప్..రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ (Chup: Revenge of the Artist) సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తున్నాడు. సన్నీడియోల్, శ్రేయా ధన్వంతరీ, పూజాభట్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఆర్ బాల్కీ డైరెక్ట్ చేస్తున్నాడు.