బేల, సెప్టెంబర్ 30 : మహిళలకు సముచిత గౌరవం ఇవ్వడంతో పాటు సంక్షేమానికి సర్కారు పెద్దపీట వేస్తున్నదని బేల ఎంపీపీ వనితాఠాక్రే పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మణియర్పూర్ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తేజ్రావ్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు అండగా సీఎం
బోథ్, సెప్టెంబర్ 30 : బతుకమ్మ చీరెలు అందజేస్తూ సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని సొనాల గ్రామంలో రేషన్ షాపు వద్ద బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో నాయకులు జాదవ్ రోహిదాస్, అఖిల్, లంక లలిత, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
సొనాల గ్రామానికి చెందిన నల్ల శ్రీధర్‌రెడ్డికి రూ 34,500, సుజిత్‌కుమార్‌కు రూ.18 వేలు, షేక్ షబానాబేగంకు రూ.14వేలు సీఎం సహాయనిధి కింద మంజూరు కాగా ఎంపీపీ తుల శ్రీనివాస్ చెక్కులు అందజేశారు. పేదల వైద్యానికి సర్కారు సీఎంఆర్ఎఫ్తో భరోసా కల్పిస్తున్నదన్నారు.
స్వరాష్ట్రంలోనే పండుగలకు గుర్తింపు
సిరికొండ, సెప్టెంబర్ 30 : స్వరాష్ట్రంలోనే పండుగలకు గుర్తింపు వచ్చిందని సర్పంచ్ జయశ్రీ పేర్కొన్నారు. మండలంలోని పోచ్చంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుమ్రం భీం ఆశయ సమితి మండలాధ్యక్షుడు పాండు, గ్రామపెద్ద లచ్చు, తదితరులు పాల్గొన్నారు.