దర్శకుడు కృష్ణ వంశీ రూపొందిస్తున్న సినిమా ‘రంగమార్తాండ’. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం అయ్యాయి.
ఇళయరాజాతో దిగిన ఫొటోను దర్శకుడు కృష్ణ వంశీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘సంగీత జ్ఞాని ఇళయరాజా మా సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. సన్నివేశాలకు నేపథ్య సంగీతం పూర్తి సంతృప్తికరంగా కుదురుతోంది’అని ట్వీట్లో పేర్కొన్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.