నరేష్ అగస్త్య కథానాయకుడిగా నటిస్తున్న ‘దిల్ వాలా’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వీరభద్రం చౌదరి దర్శకుడు. నబిషేక్, తూము నర్సింహ పటేల్ నిర్మాతలు. క్రైమ్ కామెడీ జోనర్లో తెరకెక్కిస్తున్నామని దర్శకుడు తెలిపారు. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్ స్వరకర్త.