హరీష్ కళ్యాణ్, అతుల్య రవి నాయకా నాయికలుగా నటిస్తున్న సినిమా ‘డీజిల్’. థర్డ్ ఈవ్ ఎంటర్టైన్మెంట్, ఎస్పీ సినిమాస్ పతాకంపై ఎం దేవరాజులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు షణ్ముగం ముత్తుసామి రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ను తాజాగా ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. సాయికుమార్, కరుణాస్, వినయ్ రాయ్ అనన్య, అరుణ్ పాండియన్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : ధిబు నినన్ థామస్, సినిమాటోగ్రఫీ : ఎంఎస్ రాజు.