వాషింగ్టన్, సెప్టెంబర్ 27: టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో ప్రొటీన్ సప్లిమెంట్ సాయపడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. టైప్ 2 డయాబెటిస్ వ్యక్తులు భోజనానికి ముందు కొద్దిమొత్తంలో ‘వీ ప్రొటీన్’ తాగడం వల్ల వారిలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటును నియంత్రిస్తుందని తెలిపింది. తక్కువ డోసులో వీ ప్రొటీన్ తాగిన వారిని పరిశోధకులు వారం పాటు పర్యవేక్షించారు. అదేవిధంగా వీ ప్రొటీన్ ప్రయోజనాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు అదే వ్యక్తులకు ప్రొటీన్ లేని పదార్థాలను తాగించి వారం పాటు గమనించారు. భోజనానికి ముందు వీ ప్రొటీన్ సప్లిమెంట్ తీసుకొన్నప్పుడు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు మరింత మెరుగ్గా నియంత్రణలో ఉన్నట్టు పరిశోధకులు అధ్యయనంలో పేర్కొన్నారు.