నాని (Nani) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నప్రాజెక్టు దసరా (Dasara). ఇప్పటికే ఈ సినిమా తొలి సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాన్ ప్రోమో వీడియో ఒకటి లీక్ చేసి అభిమానులను నాని ఖుషీ చేశాడు. తాజాగా ధూమ్ ధామ్ దోస్తాన్ లిరికల్ సాంగ్ (Dhoom Dhaam Dhosthaan Song)ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాట బొగ్గు గని బ్యాక్ డ్రాప్ లొకేషన్లో ఊరమాస్ గా సాగుతూ.. నాని అండ్ టీం స్టెప్పులతో దుమ్ము లేపుతుంది. ‘ఉంటే వైకుంఠం..లేకుంటే ఊకుంటం…’అంటూ నర్సన్న (నల్లగొండ గద్దర్) వాయిస్‌తో మొదలైంది పాట. ఈ పాటను నర్సన్న, గొట్టె కనకవ్వ, గన్నొర దాసలక్ష్మి, పాలమూరు జంగిరెడ్డి పాడగా..కాసర్ల శ్యామ్ కంపోజ్ చేశారు. సంతోష్ నారాయణ్ టీం ప్రోగ్రామింగ్ చేసింది.
దసరా చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోంది.
దసరా మూవీలో జరీనా వహబ్, సాయికుమార్, సముద్రఖని కీ రోల్స్ పోషిస్తున్నారు. సింగరేణి ప్రాంతంలో ని గ్రామం నేపథ్యంలో సాగే స్టోరీతో మాస్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. 2023 మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
Read Also : Singer Alfaaz | దాబాలో సింగర్‌పై దాడి..ఇంతకీ జరిగిందంటే..!
Read Also : PS-1 US collections | యూఎస్ బాక్సాఫీస్ వద్ద పొన్నియన్ సెల్వన్-1 హవా..కలెక్షన్లివే
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్లో ఎస్ఎస్ రాజమౌళి..వీడియో