Captain Miller Title Poster | తమిళ స్టార్ ధనుష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన సినిమాల అడపా దడపాగా విడుదలవుతూ ఉండేవి. అయితే ‘రఘువరన్ B-Tech’ ధనుష్‌కు తెలుగులో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం ధనుష్ చేతిలో ఐదు సినిమాలున్నాయి. ప్రస్తుతం ఈయన అరుణ్ మతేశ్వరణ్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రానికి కెప్టెన్ మిల్లర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. జీ. వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సత్య జోతి బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. 1930-40లో సాగే పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ధనుష్ నటించిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’ జూలై 15న విడుదల కానుంది. దీనితో పాటుగా తమిళంలో ‘తిరుచిత్రంబలం’ ఆగస్టు 22న విడుదల కానుంది. తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సర్’ సినిమాను చేస్తున్నాడు.
Captain miller .. This is going to be so exciting. Super kicked to work with @ArunMatheswaran and my brother @gvprakash @SathyaJyothi pic.twitter.com/lS8OMSh4I9
— Dhanush (@dhanushkraja) July 2, 2022