e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News అభివృద్ధిలో నంబర్‌వన్‌ తెలంగాణ

అభివృద్ధిలో నంబర్‌వన్‌ తెలంగాణ

అభివృద్ధిలో నంబర్‌వన్‌ తెలంగాణ
  • ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే నాయకుడు సీఎం కేసీఆర్‌
  • ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌

ఎల్బీనగర్ : అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌వన్‌ రాష్ట్రంగా ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌ గుప్తా అన్నారు. చైతన్యపురిలో ఆదివారం నిర్వహించిన సీనియర్‌ సిటిజన్స్‌ సేవా సమితి రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజలకు అండగా నిలిచి అక్కున చేర్చుకునే నాయకుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని అందుకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఉద్యోగులకు, సీనియర్‌ సిటిజన్స్‌కు పీఆర్సీలో ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం ద్వారా అందరికీ న్యాయం చేశారన్నారు.

ఈ సందర్భంగా 75 సంవత్సరాలు నిండిన ప్రాథమిక సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీజేఏసీ చైర్మన్‌ కె.లక్ష్మయ్య, ఏఐఎస్‌పీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి జి. పూర్ణచందర్‌రావు, చైర్మన్‌ డి.సుధాకర్‌, హైదరాబాద్‌ యూనిట్‌ అధ్యక్షుడు ఓంప్రకాశ్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎస్‌.బాగారెడ్డి, టీఎస్‌జీపీఏ సలీంనగర్‌ అధ్యక్షుడు ఎం.భరత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌.రాంచందర్‌రావు, కోశాధికారి జి.ప్రసాద్‌రావు, కె.మదన్‌మోహన్‌రావు, కమిటీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధిలో నంబర్‌వన్‌ తెలంగాణ

ట్రెండింగ్‌

Advertisement