నాని (Nani) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం దసరా (Dasara). డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో ఫస్ట్ సాంగ్ అప్ డేట్ వీడియోను (Dasara first single video) మేకర్స్ అండ్ టీం నెట్టింట షేర్ చేసింది.
తొలి పాట ధూమ్ ధామ్ దోస్తాన్ పాటను అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేయగా..నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగుతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో జరీనా వహబ్, సాయికుమార్, సముద్రఖని కీ రోల్స్ లో నటిస్తున్నారు.
మాస్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. దసరా చిత్రాన్ని 2023 మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
It’s time 🔥#DhoomDhaamDhosthaan
This#Dasara pic.twitter.com/ZbUOc57vNp— Nani (@NameisNani) September 29, 2022
Read Also : Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
Read Also : Trivikram | మహేశ్ కోసం తొలిసారి త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం..వర్కవుట్ అయ్యేనా..?
Read Also : Ravi Kishan | రూ.3.25 కోట్లు మోసం..స్నేహితుడిపై ‘రేసు గుర్రం’ విలన్ ఫిర్యాదు..!