పట్నా : పెండ్లి వేడుకలో డ్యాన్సర్లు గన్స్ చూపుతూ సెలబ్రేటరీ ఫైరింగ్‌కు పాల్పడిన ఘటన బిహార్‌లోని వైశాలిలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ వీడియోలో నలుగురు డ్యాన్సర్లు స్టేజ్‌పై స్టెప్పులతో హోరెత్తిస్తుండగా వారి వెనుక నలుగురు వ్యక్తులు డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. మరుక్షణంలో ఓ యువకుడు డ్యాన్సర్ చేతిలో నుంచి గన్ గుంజుకుని గాలిలోకి కాల్పులు జరపడంతో డ్యాన్సర్ కంగుతింది.
వైశాలి జిల్లాలోని కర్తహ గ్రామంలో ఓ పెండ్లి వేడుకలో ఈ వీడియో రికార్డు చేశారు. వీడియోను తనిఖీ చేశామని స్దానిక పోలీస్ అధికారి రాఘవ్ దేవ్ తెలిపారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని చెప్పారు.