కుక్క పిల్లలంటే చాలామందికి ఇష్టం. అందుకే వాటిని ఇండ్లలో పెంచుకుంటారు. అల్లారు ముద్దుగా చూసుకుంటారు. ఇంటర్నెట్లోనూ పెంపుడు కుక్కపిల్లలకు సంబంధించిన వీడియోలు తరుచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా, రెయిన్ కోట్ వేసుకుని వర్షంలో పరుగెత్తుతున్న కుక్కపిల్ల వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. నెటిజన్ల మనసు దోచుకుంటున్నది.
ఈ వీడియోను ‘డాగ్స్ ఆఫ్ ఇన్స్టాగ్రాం’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఓ చిన్న కుక్కపిల్ల పసుపురంగు రెయిన్‌కోట్ ధరించి వర్షంలో పరుగెత్తుకుంటూ వచ్చి ఇంట్లోకి చేరింది. ఆ రెయిన్‌కోట్‌ను కుక్కపిల్లకోసమే ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు లవ్ ఎమోజీలతో కామెంట్ బాక్స్‌ను నింపేస్తున్నారు. ఇప్పటివరకూ లక్ష మందికిపైగా వీడియోను లైక్ చేశారు. తమ కుక్క పిల్లకి కూడా ఇలాంటి రెయిన్‌కోట్ ఇస్తామని కొందరు కామెంట్ చేశారు.