న్యూఢిల్లీ : నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మకాలను పెంచుకునేందుకు ఓలా ఎలక్ట్రిక్ తన ఫ్లాగ్షిప్ ఎస్1 ప్రొ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ 10,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఆఫర్ కింద ఈ మోడల్ ఇప్పుడు రూ 1,29,000 (ఎక్స్-షోరూం)కు కస్టమర్లకు అందుబాటులో ఉంది.
ఎస్1 ప్రొపై తాజా ఆఫర్ అక్టోబర్ 5 వరకూ అందుబాటులో ఉంటుందని, కొత్త వాహనాల కొనుగోలుపైనే ఈ ఆఫర్ లభిస్తుందని ఓలా ఎలక్ట్రిక్ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాలు స్పష్టం చేశాయి. ఎస్1 ప్రొ ధర 1,63,549 కాగా హోమ్ చార్జర్, పెర్ఫామెన్స్ అప్‌గ్రేడ్‌తో మొత్తం ధర రూ 1,99,549 కాగా ఫేమ్-2 సబ్సిడీతో ఎక్స్ షోరూం ధర రూ 1,39,999కి దిగివచ్చింది. నవరాత్రి ఫెస్టివ్ డిస్కౌంట్‌తో ఓలా ఎస్1 ప్రొ ఎక్స్‌షోరూం ధర రూ 1,29,000కు తగ్గింది.
ఎస్1 ప్రొ 8.5కేడబ్ల్యూ మోటార్, 4కేడబ్ల్యూ హెచ్ బ్యాటరీని కలిగిఉంది. ఇది 2.9 సెకండ్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 4.5 సెకండ్లలో 0-60 కిమీ వేగం అందుకుటుంది. ఎస్1 ప్రొ పూర్తి చార్జింగ్ అయయేందుకు ఆరున్నర గంటల సమయం తీసుకుంటుంది. నవరాత్రి ఫెస్టివ్ ఆఫర్లలో భాగంగా రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.