మెల్బోర్న్: ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్, వైస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) శుక్రవారం అధికారికంగా ఎంపిక చేసింది. సహచర ఉద్యోగికి అసభ్య సందేశాలు పంపాడని నిర్ధారణ కావడంతో టిమ్ పైన్ టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో తొలిసారి ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేయడం విశేషం. ‘కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా ఉంది. జట్టుకు టిమ్ పైన్ మాదిరి నేను సేవలు అందిస్తా’ అని కమిన్స్ తెలిపాడు. ‘కమిన్స్ అద్భుతమైన ఆటగాడు, నాయకుడు కూడా’ అని సీఏ సీఈఓ నిక్ హక్లీ తెలిపాడు. టెస్ట్ బాధ్యతలు చేపట్టనున్న కమిన్స్ మొదట ఎదురయ్యే సవాల్ యాషెస్ టెస్ట్. డిసెంబర్ 8 నుంచి బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆసీస్ ఆడనుంది.
కెప్టెన్సీ నుంచి వైదొలిగిన టిమ్ పైన్ ప్రతిష్ఠాత్మక యాషెస్ టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మానసిక ప్రశాంతత కోసం అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సమ్మతించింది. ‘ఆపత్కాలంలో పైన్ తీసుకున్న నిర్ణయం సరైనది. పైన్‌తో పాటు అతడి కుటుంబానికి మేం అండగా ఉంటాం’ అని సీఏ తెలిపింది.