లిస్బన్: పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తనకు మరెవరు సాటిలేరని ఘనంగా చాటిచెప్పాడు. ప్రపంచకప్ క్వాలిఫయింగ్‌లో భాగంగా లక్సెంబర్గ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించాడు. దీంతో 5-0తో పోర్చుగల్ విజయదుందుభి మోగించింది. మ్యాచ్‌లో తనదైన జోరు కనబరిచిన రొనాల్డో అంతర్జాతీయ కెరీర్లో పది సార్లు హ్యాట్రిక్ గోల్స్ చేసిన తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 182 మ్యాచ్‌ల్లో 115 గోల్స్‌తో ఈ స్టార్ స్ట్రైకర్ టాప్‌లో కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా చూస్తే రొనాల్డో కెరీర్లో ఇది 58వ హ్యాట్రిక్ ఫీట్ కావడం విశేషం.