కిక్, రేసు గుర్రం, సైరా లాంటి చిత్రాల తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surenderreddy) నుంచి రాబోతున్న క్రేజీ చిత్రం ఏజెంట్ (Agent). యాక్షన్ ఓరియెంటెడ్ స్టోరీతో వస్తున్న ఈ మూవీలో యువ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) టైటిల్ రోల్ చేస్తుండగా..సాక్షి వైద్య (Sakshi vaidya) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కాగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఏజెంట్లో పాపులర్ బాలీవుడ్ నటుడు, నిర్మాత డినో మోరియా కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజా అప్డేట్ ప్రకారం డినో మోరినా ఇందులోనెగెటివ్ రోల్లో కనిపించనున్నాడట. దీనిపై అఖిల్ టీం ఏదైనా అఫీషియల్ అప్ డేట్ ఇస్తుందేమో చూడాలి. మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఏకే ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కీ రోల్ చేస్తున్నాడు. కమర్షియల్ యాడ్స్ లో నటించిన సాక్షి వైద్య ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుంది. ఆగస్టు 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది ఏజెంట్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే మూవీ లవర్స్ కు మంచి ట్రీట్ ఇవ్వబోతుందని చెబుతున్నాయి.