e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News 13 రాష్ట్రాల్లో ల‌క్ష‌కుపైగా యాక్టివ్ కేసులు: కేంద్రం

13 రాష్ట్రాల్లో ల‌క్ష‌కుపైగా యాక్టివ్ కేసులు: కేంద్రం

13 రాష్ట్రాల్లో ల‌క్ష‌కుపైగా యాక్టివ్ కేసులు: కేంద్రం

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ ప్ర‌భావం దేశంలోని 13 రాష్ట్రాల్లో అత్య‌ధికంగా ఉన్న‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌, ప‌శ్చిమబెంగాల్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, బీహార్ రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ల‌క్ష‌కు పైగా ఉన్న‌ద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఈ 13 రాష్ట్రాల జాబితాలో 5,93,150 యాక్టివ్ కేసులతో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉండ‌గా.. 1,05,104 కేసుల‌తో బీహార్ చివ‌రి స్థానంలో ఉన్న‌దని తెలిపింది.

తెలంగాణ‌లో త‌గ్గుతున్న కేసులు
ఇక 50 వేల‌కు పైన, ల‌క్ష‌కు త‌క్కువ‌ యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాలు ఆరు ఉన్నాయ‌ని, 50 వేల లోపు యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాలు 17 ఉన్నాయని కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, బీహార్‌, గుజ‌రాత్‌, ఉత్త‌రాఖండ్‌, జార్ఖండ్‌, చండీగ‌ఢ్‌, ల‌ఢ‌ఖ్‌, డామ‌న్ అండ్ డ‌య్యూ, ల‌క్ష‌ద్వీప్‌, అండ‌మాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లో రోజువారీ కొత్త కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న‌ద‌ని వెల్ల‌డించింది.

కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు
ఇదిలావుంటే క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఒడిశా, పంజాబ్‌, అసోం, జ‌మ్ము అండ్ క‌శ్మీర్‌, గోవా, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరి, మ‌ణిపూర్, మేఘాల‌యా, త్రిపుర‌, నాగాలాండ్‌, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో మాత్రం రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ద‌ని ఆరోగ్య‌శాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 30.56 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు

కరోనా కల్లోలంలో బ్లాక్ ఫంగస్ బెడద

రోజువారీ క‌రోనా కేసుల్లో మ‌హారాష్ట్ర‌ను వెన‌క్కి నెట్టిన క‌ర్ణాట‌క‌

రెమ్‌డిసివిర్ కోసం క‌రోనా బాధిత కుటుంబాల‌ అవ‌స్థ‌లు..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
13 రాష్ట్రాల్లో ల‌క్ష‌కుపైగా యాక్టివ్ కేసులు: కేంద్రం

ట్రెండింగ్‌

Advertisement