అమెరికాలో దుప్పులకూ కరోనా సోకింది. వైట్ టెయిల్డ్ డీర్ శరీరంలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో వాటికి కరోనా సోకి ఉండవచ్చనే నిర్ధారణకు వచ్చారు. అమెరికాలోని మిచిగాన్, ఇల్లినాయిస్, న్యూయార్క్, పెన్సెల్వేనియా నగరాలకు చెందిన దాదాపు 600కు పైగా దుప్పుల రక్త నమూనాలను అమెరికా వ్యవసాయ విభాగం ( USDA ) పరిశీలించింది. ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య ఈ శాంపిల్స్‌ను సేకరించి పరిశీలించింది. వీటిలో దాదాపు 152 దుప్పుల్లో SARS-CoV-2 వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు.
కరోనా వైరస్‌ను ఆకర్షించే ఎస్2 రెసిప్టర్లు దుప్పుల్లో ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ వీటికి వైరస్ సోకినా.. వెంటనే అవి వాటితో పోరాడగలవు. అంతేకాకుండా ఇవి వైరస్‌కు రిజర్వాయర్లుగా ఉండే అవకాశం ఉంది. అంటే.. వన్యప్రాణులకు వైరస్ సోకితే వాటి శరీరంలో వైరస్ అలాగే రిజర్వ్‌గా ఉండిపోతుంది. ఇలా రిజర్వ్‌గా ఉండిపోవడం వల్ల ఎప్పటికైనా ముప్పే ఉంటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. దుప్పుల్లో రిజర్వ్‌గా ఉన్న ఈ వైరస్ ఇతర జంతువులకు సోకి వాటి ద్వారా మనుషులకు సోకే అవకాశం ఉంది. దీన్నే రివర్స్ జూనోసిస్ అని పిలుస్తారు. ఇలా వన్యప్రాణుల నుంచి మనుషులకు సోకే క్రమంలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా.. కొత్త వేరియంట్ బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.