ఓ జంట.. వ్యాయామం చేస్తూ లిప్ కిస్ చేశారు. దానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ జంట కూడా యువ జంట అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వాళ్లు వృద్ధ జంట. ఇద్దరూ వర్కవుట్స్ చేస్తూ లిప్ కిస్ పెట్టుకున్నారు. పుల్ అప్ బార్ మీద ఇద్దరూ ఎక్సర్సైజ్ చేస్తూ ఒకరికి మరొకరు లిప్ కిస్ ఇచ్చుకున్నారు.
పుల్ అప్స్ బార్ మీదనే ఆ జంట చిలిపి చేష్టలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వాళ్లకు కలిసే వర్కవుట్ చేస్తారు.. కలిసే ఉంటారు.. అంటూ క్యాప్షన్ పెట్టి ఆ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు.