e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News సర్కారీ స్కూళ్లకు కార్పొరేట్‌ దన్ను

సర్కారీ స్కూళ్లకు కార్పొరేట్‌ దన్ను

  • సీఎస్సార్‌ నిధులతో పాఠశాలలకు కొత్త కళ  
  • రెండేండ్లలో రూ.150 కోట్లకు పైగా ఖర్చు 
  • 280 పాఠశాలల్లో మౌలికవసతుల కల్పన

హైదరాబాద్‌, మార్చి 9 (నమస్తే తెలంగాణ):  రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు కార్పొరేట్‌ సంస్థలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నాయి. తమ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్సార్‌) నిధులను పాఠశాలల అభివృద్ధికి భారీగా ఖర్చు చేస్తున్నాయి. 2018 నుంచి ఇప్పటివరకు రూ.150 కోట్లకు పైగా నిధులను ఇందుకోసం వెచ్చించాయి. పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, కంప్యూటర్‌ ల్యాబులు, డ్యూయల్‌ డెస్క్‌ బల్లలు తదితర మౌలిక వసతులను సీఎస్సార్‌ నిధులతో కల్పిస్తున్నాయి. ఇలా రెండేండ్లలో 280కి పైగా స్కూళ్లల్లో వసతుల కొరతను తీర్చారు.

విద్యాశాఖ చొరవతో..

రాష్ట్రంలో 26,062 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 19.83 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ అభివృద్ధికి చేపట్టిన ప్రత్యేక చర్యలతో ఇటీవలి కాలంలో ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు అద్భుతంగా పెరిగాయి. దాంతో చాలామంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. దాంతో వారందరికి సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు, బల్లలు వంటి సదుపాయాలు కల్పించటం కష్టంగా మారింది. సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చుచేస్తున్నా  కొన్నిచోట్ల సమస్యలు ఉంటున్నాయి. దాంతో ప్రభుత్వ సూళ్ల అభివృద్ధిలో ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలను కూడా భాగస్వాములను చేయాలని విద్యాశాఖ సంకల్పించింది. ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటుచేసిన కార్పొరేట్‌ సంస్థల నుంచి నిధుల సమీకరణ చేపట్టింది. పరిశ్రమలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు లేఖలు రాయగా, చాలా సంస్థలు ముందుకు వచ్చి పాఠశాలల అభివృద్ధికి సీఎస్సార్‌ నిధులను ఖర్చుచేస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ఐటీ కంపెనీలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థి కమిటీలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నారు. 

2018 ఖర్చు చేసిన నిధుల్లో కొన్ని..

  • పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) ఖమ్మం జిల్లాలో రూ.9.46 కోట్లతో 49 పాఠశాలల్లో 69 తరగతి గదులు నిర్మించింది. 62 పాఠశాలలకు 2,670 డ్యూయల్‌ డెల్క్‌ బల్లలను అందజేసింది. 
  • మిధాని ఖమ్మం జిల్లాలోని 13 పాఠశాలల్లో 21 మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు, 18 పాఠశాలలకు 687 డ్యూయల్‌ డెస్క్‌ బల్లలను అందజేసింది. 
  • బీడీఎల్‌ 1,280 బెంచీలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. 
  • హెచ్‌ఏఎల్‌ ఇచ్చిన రూ.2 కోట్ల విరాళంతో ఐదు కస్తుర్భాగాంధీ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నది. 
  • సిద్దిపేట జిల్లాలో కావేరీ సీడ్స్‌ రూ.3 కోట్లతో పారుపల్లి స్ట్రీట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల భవనం, కంప్యూటర్‌ ల్యాబ్‌, డిజిటల్‌ క్లాస్‌రూంలను నిర్మించింది. 
  • ఇందిరానగర్‌ జడ్పీహెచ్‌ఎస్‌కు నాట్కో రూ.1.4 కోట్లు అందజేయగా, అదనపు తరగతి గదులను నిర్మించారు. 
  • చింతమడక మండల ప్రాథమిక పాఠశాల భవనాన్ని కావేరీ సీడ్స్‌ సంస్థ రూ.60 లక్షలతో నిర్మించింది. 
  • హెటిరో డ్రగ్స్‌, బాలవికాస సంస్థలు సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో డ్యూయల్‌ డెస్క్‌ బల్లలను సమకూర్చగా, మెదక్‌ జిల్లా బొంతపల్లి ప్రాథమిక పాఠశాలలో హెటిరో సంస్థ మరుగుదొడ్లు నిర్మించింది.  
  • కరీంనగర్‌ జిల్లాలో 112 స్కూళ్లకు ఎన్టీపీసీ రూ.50 లక్షలతో 1,335 డ్యూయల్‌ డెస్క్‌ బల్లలు ఇచ్చింది. బీపీఎన్‌ఎల్‌ సంస్థ సైతం 1,470 బెంచీలను అందజేసింది.
  • వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్న మందడి పాఠశాలకు అమరేందర్‌ట్రస్ట్‌  1.8 లక్షల విలువైన 6 కంప్యూటర్లు,  ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కంపెనీ 4 లక్షల విలువైన 50 డ్యూయల్‌ డెస్క్‌బల్లలు, మెగా కంపెనీ లక్ష విలువచేసే సోలార్‌ పవర్‌ప్లాంట్‌ను అందజేసింది.
  • ఐటీసీ కంపెనీ మెదక్‌ జిల్లాలోని నాలుగు స్కూళ్లలో  రూ.27,86,908తో  మౌలికవసతుల కల్పించింది.  మనోహరాబాద్‌ జడ్పీ హెచ్‌ఎస్‌కు రూ.9,59,349, ఎంపీపీఎస్‌కు రూ.20లక్షలు, కల్లకల్‌ జడ్పీహెచ్‌ఎస్‌కు రూ. 8,07,559, రంగయ్యపల్లి జడ్పీహెచ్‌ఎస్‌కు రూ.8,20,00లను ఖర్చుచేసింది. 
  • మేడ్చల్‌ మాల్కాజిగిరి జిల్లాలోని 49 పాఠశాల భవనాలకు ప్రైవేట్‌ విద్యాసంస్థల కమిటీలు రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement