వాషింగ్టన్ : చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ ప్రయత్నంలో ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్ బిజీగా ఉన్నది. సెప్టెంబర్ నాటికల్లా పిల్లలకు ఇచ్చేందుకు అనుమతి కోసం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు ఫైజర్ సంస్థ విజ్ఞప్తి చేసుకున్నది. 2 నుంచి 11 సంవత్సరాల వయసున్న పిల్లలకు టీకా మందులు ఇచ్చేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉన్నదని ఫైజర్ సంస్థ తెలిపింది. 12 నుంచి 15 ఏండ్ల వయస్సు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర ఉపయోగం కోసం వచ్చే వారం ఎఫ్‌డీఏ నుంచి అనుమతి పొందే అవకాశాలు ఉన్నాయి.
16 నుంచి 85 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి ఈ నెలలో వ్యాక్సిన్ అనుమతి పొందాలని ఫైజర్ యోచిస్తున్నది. ఆగస్టు ప్రారంభంలో గర్భిణిలకు సురక్షితంగా టీకాలు వేయడానికి క్లినికల్ ట్రయల్ డాటాను కూడా ఈ సంస్థ కలిగి ఉంన్నది. కొవిడ్ వ్యాక్సిన్‌ను యువతకు అందుబాటులో ఉంచడానికి ఎఫ్‌డీఏ ప్రయత్నిస్తున్నది. ఈ సమాచారాన్ని వైట్ హౌస్ కార్యదర్శి జేన్ సాకి మంగళవారం ఒక వార్తా సమావేశంలో తెలిపారు.
హర్యానాలో ప్రభుత్వ ఆజమాయిషీలో ప్రైవేట్ దవాఖానలు
ఓటమితో మమతకు సీఎంగా నైతిక హక్కు లేదు : త్రిపుర సీఎం బిప్లబ్
యాహూతో గూగుల్‌ను సవాల్ చేయాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్..?!
ఫుట్‌పాత్‌పై రసరమ్య సంగీత బాణీలు.. చరిత్రలో ఈరోజు
‘రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయిస్తారు’: నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై ఈసీ
ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి 5 జీ సేవలు..?
పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
భారతదేశం సేవలు అజరామరం : హార్వర్డ్ ప్రొఫెసర్ జెస్సీ బంప్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..