లండన్, అక్టోబర్ 12: యూరప్ అంతటా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ బోర్డు ధ్రువీకరించింది. ‘కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
మరో వేవ్ వస్తుందనటానికి ఇది నిదర్శనం’ అని డబ్ల్యూహెచ్వో యూరప్ డైరెక్టర్ హాన్స్ ఖ్లూజ్ తెలిపారు. కాగా, చైనాలోనూ కరోనా కేసులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది.