సిడ్నీ: ఆస్ట్రేలియాకు 201 పరుగుల లక్ష్యాన్ని విసిరింది న్యూజిలాండ్. ఇవాళ టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)లో భాగంగా జరిగిన తొలి సూపర్ 12 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 రన్స్ చేసింది. కాన్వే 92 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
New Zealand end their innings at 200/3 in Sydney!
Will Australia chase this down❓#T20WorldCup | #AUSvNZ | 📝 Scorecard: https://t.co/ouB6f5vSvG pic.twitter.com/QbbCOcdEUf
— ICC (@ICC) October 22, 2022
తొలి వికెట్‌కు అలెన్, కాన్వేలు 56 రన్స్ జోడించారు. చివరలో జేమ్స్ నీషమ్ 13 బంతుల్లో 26 రన్స్ చేసి కివీస్‌కు భారీ స్కోర్‌ను అందించాడు. కాన్వే 58 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 92 రన్స్ చేశాడు.
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకున్నది. ఓపెనర్ అలెన్ దూకుడుగా ఆడాడు. కేవలం 3.5 ఓవర్లలోనే కివీస్ 50 పరుగుల మార్క్‌ను దాటింది. కివీస్‌కు మంచి స్టార్ట్ ఇచ్చిన అలెన్ .. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అలన్ కేవలం 16 బంతుల్లో 42 రన్స్ చేసి ఔటయ్యాడు.