బాలీవుడ్ (Bollywood)లో ఫైర్ బ్రాండ్ లేడీ అంటే ఠక్కున గుర్తొచ్చే నటి కంగనారనౌత్ (Kangana Ranaut). ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా లేవెనెత్తుతూ హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ కాంట్రవర్సియల్ ‘క్వీన్’ (Ajay Devgn). ఈ భామ ఇటీవల బ్రహ్మాస్త్రపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. కాగా ఇపుడు మరో యాక్టర్‌పై ప్రశంసలు కురిపించింది కంగనా.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ (Ajay Devgn)అహ్మదాబాద్ లో సొంతంగా మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించాడు. ఇతర పట్టణాల్లో థియేటర్ల ప్రారంభం, భవిష్యత్ ప్రణాళికలను చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో అజయ్దేవ్గన్ను ఆకాశానికెత్తేసింది కంగనా. సూపర్ స్టార్ తనకున్న వనరులను, ప్రభావాన్ని ఎఫెక్టివ్‌గా ఉత్తమంగా వినియోగించుకోవాలనుకుంటున్నాడు.
అజయ్ దేవ్ గన్ ఆలోచన ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, ఇండియా-చైనాలో స్క్రీన్స్ డాటాను గురించి తెలియజేస్తుందని చెప్పింది కంగనారనౌత్. అజయ్ దేవ్గన్ ఎప్పుడూ తన సినిమాలను ప్రమోట్ చేయడని చెప్పి గతంలో అందరినీ షాక్‌కు గురిచేసింది కంగనారనౌత్.
ఇపుడు అజయ్ దేవ్గన్ తన సినిమాలనే కాకుండా అన్ని సినిమాలను ప్రమోట్ చేస్తాడని కంగనారనౌత్ కామెంట్ చేయడం ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఏదేమైనా ఒకరికి వార్నింగ్ ఇవ్వాలన్నా..మరొకని ప్రోత్సహించాలన్నా..అది కంగనాకే సాధ్యమంటున్నారు సినీ జనాలు. ప్రస్తుతం ఇందిరాగాంధీ హయాంలో ఎమెర్జెనీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘ఎమెర్జెన్సీ’ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తోంది కంగనారనౌత్.
Read Also : Conman Sukesh Case | మరో నలుగురు హీరోయిన్లకు ఖరీదైన కానుకలు..ఇంతకీ వాళ్లెవరు..?
Read Also : Indian 2 | ఇండియన్ 2లో కమల్‌హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్‌లో అంతా షాక్..!
Read Also : Vikram Vedha | బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్.. ‘విక్రమ్ వేధ’ ఎన్ని దేశాల్లో రిలీజవుతుందో తెలుసా..?