న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్’ ( Conflict in Hero Family ) యాజమాన్యం ముంజాల్ కుటుంబంలో వివాదాలు పెరుగుతున్నాయని తెలుస్తున్నది. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహనాలకు హీరో బ్రాండ్‌ను వాడుకోవడంపై కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ పెరుగుతున్నదని సమాచారం. ముంజాల్ కుటుంబ సభ్యులు న్యాయ పోరాటానికి దిగే అవకాశాలు ఉన్నాయా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
విద్యుత్ వాహనాల విభాగంలోకి ఎంటరవుతున్నట్లు పవన్ ముంజాల్ సారధ్యంలోని హీరో మోటో కార్ప్స్ ప్రకటించడమే ఈ వివాదానికి మూలమనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఒకవేళ పవన్ ముంజాల్ విద్యుత్ వాహనాల రంగంలోకి వస్తే, బాబాయితో తలపడేందుకు సిద్ధం అని హీరో ఎలక్ట్రిక్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముంజాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటు హీరో మోటో కార్ప్, అటు హీరో ఎలక్ట్రిక్ మార్కెట్ లీడర్లుగా ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద టూవీలర్స్ మాన్యుఫాక్చరర్‌గా ఉన్న హీరో మోటో కార్ప్.. 2021-22లో ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది. దీన్ని అడ్డుకునేందుకు ఏం చేయడానికైనా సరేనని హీరో ఎలక్ట్రిక్ ప్రతి సవాల్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ వివాదంపై తాము అంతగా ఆందోళనకు గురి కావడం లేదని హీరో ఎలక్ట్రిక్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముంజాల్ క్లారిటీ ఇచ్చారు. కంపెనీ లావాదేవీలపై కుటుంబ సభ్యుల మధ్య స్పష్టమైన ఒప్పందం అమలులో ఉండటమే దీనికి కారణంగా తెలుస్తున్నది.
2010లో హీరో మోటో కార్ప్ పునర్వ్యవస్థీకరణ సమయంలో బ్రాండ్లను ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించారు. ఎవరైనా ఏ విభాగంలోకైనా ప్రవేశించొచ్చు. కానీ బ్రాండ్ వాడకంపై చాలా గట్టిగా నాన్-కంపీట్ నిబంధన ఉందని ముంజాల్ కుటుంబ సభ్యులు తెలిపారు.
తైవాన్ గొగొరోతో కలిసి భారత మార్కెట్ కోసం హీరో బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) డెవలప్ చేస్తామని గత ఏప్రిల్‌లో హీరో మోటో కార్ప్ ప్రకటించింది. ఈవీ బైక్స్, స్కూటర్ల డిజైన్ కోసం స్వతంత్రంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ & డీ) వసతులు కల్పించింది. 2022 మార్చిలోపు హీరో మోటో కార్ప్ వారి తొలి ఈవీ బైక్ విపణిలోకి వస్తుంది.
విద్యుత్ వాహన రంగంలోకి హీరో మోటో కార్ప్ రాకుండా తప్పనిసరి అవసరమైన చర్యలు తీసుకుంటామని నవీన్ ముంజాల్ తెలిపారు. ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్స్, గ్రీన్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తమతో ఉన్నాయన్నారు.
మధ్యలో ఎవరైనా దూరాలని ప్రయత్నిస్తే అడ్డుకునేందుకు చర్యలు తప్పవని, ఏమాత్రం సంకోచానికి తావు లేదని నవీన్ ముంజాల్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల మధ్య సెంటిమెంట్లకు మాత్రమే కాక, కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన ఒప్పందంలో ప్రతి పదం అమలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఒప్పందం ఖచ్చితంగా అమలు చేస్తామని, అందులో సందేహానికి తావు లేదన్నారు.
హీరో ఎలక్ట్రిక్‌తో తల పడేందుకు హీరో మోటో కార్ప్స్ కూడా సిద్ధమని సంకేతాలిచ్చింది. చట్టపరంగా తమకు ఉన్న ఆప్షన్లను వాడుకుంటామని తెలిపింది. అయితే, కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా ముందుకెళతామని వ్యాఖ్యానించింది.
హీరో మోటో కార్ప్స్ తన హక్కులపై పూర్తిగా అవగాహన ఉందని తెలిపింది. ఉత్తమ లీగల్ సలహాకు అనుగుణంగా తాము ఎల్లవేళలా స్పందిస్తామని పేర్కొంది. మార్కెట్లో హీరో ఎలక్ట్రిక్ 42 శాతం వాటా కలిగి ఉంది. హీరో ఎలక్ట్రిక్ నుంచి 13 ఈవీ బైక్స్ విపణిలోకి వచ్చాయి.
16న ఆరుగురు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..!
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
యశ్పాల్ శర్మ బాదాం షాట్ గురించి మీకు తెలుసా?
రైలు పట్టాలపై ఫైవ్ స్టార్ హోటల్.. ఎక్కడో తెలుసా?
హీరో విజయ్‌కి లక్ష రూపాయల జరిమానా..!
సెగలు రేపుతున్న శర్మ సిస్టర్స్ స్టిల్స్
55 కిలోమీటర్లమూసీపై 15 వంతెనలు
గోద్రెజ్ ఎయిర్ స్మార్ట్ మాటిక్ రివ్యూ : మీ ఫోన్‌తోనే ఇంటిని ఫ్రెష్‌గా చేసేయండి..
కార్పొరేట్ కొలువులు.. లగ్జరీ లైఫ్ వదిలేసి అడవిలో కాపురం
దేశీ మార్కెట్లో మహీంద్ర బొలెరో నియో లాంఛ్
“బీఎమ్‌డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
స్విఫ్ట్.. సీఎన్జీ కార్ల ధరలు పెంచిన మారుతి!
కృత్రిమ మేధపై సుందర్ పిచ్చాయ్ ఏం చెప్పారంటే..?!
‘వారు పాకిస్తాన్ పాట పాడుతున్నారు’
సెప్టెంబర్ 11న నీట్ (పీజీ) పరీక్ష: కేంద్రం
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
దూసుకెళ్తున్న పబ్జీ ఇండియా వర్షన్.. వారంలోనే 3 కోట్లకు పైగా డౌన్లోడ్లు