Sunil and satyam rajesh |ఒకప్పుడు వాళ్లను వెండితెరపై చూస్తే నవ్వు వచ్చేది. వాళ్లు ఏం మాట్లాడకపోయినా కూడా.. కేవలం మొహం చూస్తే కడుపు చెక్కలయ్యేలా నవ్వేవాళ్లు ప్రేక్షకులు. తమ కామెడీతో తెలుగు ఇండస్ట్రీలో అలాంటి బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు కొందరు కమెడియన్లు. కానీ ఇప్పుడు వాళ్లను చూస్తుంటే భయమేస్తుంది. ఎందుకంటే నవ్వించడం మానేసి విలనిజం మొదలు పెట్టారు. అలాంటి వాళ్లలో ముందు చెప్పుకోవాల్సిన పేరు సునీల్. ఈ భీమవరం బుల్లోడు ఇప్పుడు కమెడియన్ మాత్రమే కాదు.. అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టు కూడా. సెకండ్ ఇన్నింగ్స్‌లో రొటీన్ కామెడీ క్యారెక్టర్స్ కాకుండా విభిన్నంగా ప్రయత్నిస్తున్నాడు సునీల్. ఇన్నాళ్లు తనలో కేవలం కమెడియన్‌ను మాత్రమే చూసిన ప్రేక్షకులకు.. ఇప్పుడు విలన్‌ను పరిచయం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కలర్ ఫోటో, డిస్కో రాజా సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు సునీల్. ఈ రెండు సినిమాల్లో నటనకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. తాజాగా పుష్ప సినిమాలో అతి భయంకరమైన మంగళం శ్రీను పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్యారెక్టర్ కచ్చితంగా తన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అంటున్నాడు సునీల్. దీంతో పాటు మరికొన్ని సినిమాలలో కూడా విలన్ అవతారం ఎత్తాడు సునీల్.
ఇదిలా ఉంటే సత్యం సినిమాతో అద్భుతమైన కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్.. ఈ మధ్య కొన్ని సినిమాలలో ప్రతినాయకుడిగా మారిపోయాడు. తాజాగా విడుదలైన వెంకటేశ్ దృశ్యం 2 సినిమాలో ఈయన క్యారెక్టర్ చాలా బాగుంది. పోలీస్ ఆఫీసర్ పాత్ర అయినా కూడా.. ఫస్టాఫ్ మొత్తం తాగొచ్చి భార్యను హింసించే శాడిస్ట్ భర్తగా నటించాడు సత్యం రాజేశ్. ఒకప్పుడు సుధాకర్ ఇలాంటి విలన్ కమ్ కమెడియన్ పాత్రలు వేసేవాడు. ఇప్పుడు ఇదే దారిలో సునీల్, సత్యం రాజేశ్ లాంటి సీనియర్ కమెడియన్స్ వెళ్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
హరీశ్ శంకర్ సినిమా నుంచి తప్పుకున్న సునీల్.. అసలేం జరిగింది..?
సునీల్ సెకండ్ ఇన్నింగ్స్ మామూలుగా లేదుగా.. 15 సినిమాలతో బిజీ..
chiranjeevi | చిరంజీవికి పేరు లేని సినిమా ఏదో తెలుసా..?
Esther Anil | దృశ్యం పాప మామూలుగా రెచ్చిపోవట్లేదుగా..?