లండన్, మార్చి 27: సాధారణంగా కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే ఆరోగ్య సమస్యలేమో కానీ గుండెకు మాత్రం ఎంతో మేలు చేస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. రోజుకు కనీసం రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగితే హృద్రోగాలు, గుండె సంబంధిత సమస్యలతో తక్కువ వయసులోనే మరణించడం వంటి సమస్యలు 10 నుంచి 15 శాతం మేర తగ్గుతాయని అధ్యయనం చెబుతున్నది. గత పదేండ్లుగా బ్రిటన్లోని 5 లక్షల మంది ఈ అధ్యయనం నిర్వహించారు.