NBK108 Cinematographer | చాలా కాలం తర్వాత ‘అఖండ’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ సినిమా విజయం బాలయ్యకు మంచి బూస్టప్ ఇచ్చింది. ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా కోసం ఓ స్టార్ టెక్నీషియన్‌ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ‘కోబ్రా’ సినిమాకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హరీష్ కన్నన్ను #NBK108 కోసం ఛాయగ్రాహకుడిగా ఎంపిక చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తెలుగులో ఈయనకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇటీవలే విడుదలైన కోబ్రా సినిమాలో తన కెమెరా విజువల్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసాడు. అలాంటిది బాలయ్య సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండటంతో అటు ఫ్యాన్స్‌లో, ఇటు ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రాన్ని అనీల్‌రావిపూడి ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిస్తున్నాడట. బాలయ్యకు కూతురుగా ‘పెళ్లి సందD’ ఫేం శ్రీలీల నటిస్తుంది. ప్రముఖ హీరోయిన్ అంజలీ కీలకపాత్రలో నటిస్తుంది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.