ప్రకృతిలో భాగమై నివసించే అడవిబిడ్డలు, అత్యంత స్వచ్ఛమైన మనుషులు, మానవ సమాజంలో కల్మశం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీ బిడ్డలు ప్రతీకలు.. అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీ సోదరులకు కేసీఆర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
స్వయం పాలనలో తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనే కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఆదివాసీ గూడేల్లో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం పటిష్ఠ చర్యలను చేపట్టింది. వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకమైన వైద్య సౌకర్యాలు కల్పించిందని సీఎం స్పష్టం చేశారు.
మా తండాలో, మా గూడెంలో మా రాజ్యం.. అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. ఆదివాసీలను స్వయం పాలనలో భాగస్వాములను చేసే దిశగా గూడేలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి.. సర్పంచులయ్యే అవకాశం కల్పించి.. రాష్ట్ర రాజకీయ పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం చేసింది.. అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
స్వయంపాలనలో తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నదని, ఆదివాసీ గూడేల్లో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులకు పటిష్ట చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకమైన వైద్య సౌకర్యాలు కల్పించిందన్నారు
— Telangana CMO (@TelanganaCMO) August 9, 2021
మిషన్ భగీరథ ద్వారా అత్యంత సుదూరంలోని ఆదివాసీ గోండు గూడేలకు కూడా స్వచ్ఛమైన తాగునీరును అందించి నీటి ద్వారా సంక్రమించే రోగాల నుంచి ఆదివాసీలను కాపాడుతున్నామని. ఆదివాసీ బిడ్డల విద్యకోసం ఎస్టీ గురుకులాలను ఏర్పాటు చేసి అన్ని వసతులతో కూడిన అంతర్జాతీయ స్థాయి విద్యనందిస్తున్నదని తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) August 9, 2021
ఆదివాసీల దేవతలైన సమ్మక్క – సారలమ్మ సహా నాగోబా, సేవాలాల్ మహరాజ్ జాతరలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు. వీటిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తూ, జాతీయస్థాయిలో ప్రచారం కల్పిస్తున్నదన్నారు.
— Telangana CMO (@TelanganaCMO) August 9, 2021
పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ఆదివాసీ బిడ్డల కోసం, ‘గిరిపోషణ్’ పేరుతో పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ షిప్ పథకం కింద ఆదివాసీ గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) August 9, 2021