e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 25, 2021
Home News హిందుత్వానికి అసలైన ప్రతీక

హిందుత్వానికి అసలైన ప్రతీక

తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటాన్ని గాంధేయమార్గంలో అత్యంత సమర్థంగా నిర్వహించిన కేసీఆర్‌ ప్రజలందరిని ఆకట్టుకున్నారు. రాష్ర్టాన్ని సాధించిన తర్వాత ప్రజలందరి ప్రగతిని, సంక్షేమాన్ని కాంక్షించి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నారు. ఆయన నిష్కపటి. మనసులో ఒకటి పైకొకటి ఉండదు. మనసులో ఏది అనుకున్నారో అదే మాట్లాడతారు; అదే చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుల, మతాలకు అతీతంగా అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. 

కేసీఆర్‌కు అన్ని మతాల పట్ల సమాన ఆదరాభిమానాలున్నాయి. ఏ మతం పట్లా ద్వేషం లేదు. ఆయన నాయకత్వం కింద అన్ని మతాల వారు భద్రతను, సంతృప్తిని పొందుతున్నారు. అదేవిధంగా వ్యక్తిగతంగా ఆయనకు హిందూ మతాభిమానం ఉన్నది. మనసులోని ఆ అభిమానాన్ని ఆయన దాచుకోవడం లేదు. స్పష్టంగానే ప్రకటిస్తుంటారు. కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కేసీఆర్‌ నిఖార్సయిన హిందూతత్త్వానికి నిర్వచనం మాత్రమే కాదు. హిందూ మతతత్త్వాన్ని సంపూర్ణంగా జీర్ణించుకున్న వ్యక్తి. అందుకే ఆయనకు అన్ని మతాలు సమానం. హిందూ మతం ఎంత గొప్పదో ఇతర మతాలూ అంతే గొప్పవని భావిస్తున్న కేసీఆర్‌ మహోదాత్త తాత్విక చింతనను కొందరు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తుంటారు. కేసీఆర్‌ అనేక యాగాలు, యజ్ఞాలు చేశారు. జిల్లాలకు, ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు పెట్టి తన దైవభక్తిని, ధార్మికతను చాటుకున్నారు. 

- Advertisement -

పరాయి పాలనలో ఎడారిగా మారిన తెలంగాణ పొలాలను పసిడి పంటల నిలయంగా మార్చాలని భగీరథ సంకల్పంతో మూడేండ్లలోనే దేశంలోనే అతి పెద్ద మానవ నిర్మిత ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు కేసీఆర్‌ గారు. ఇదొక ఇంజినీరింగ్‌ అద్భుతమని ప్రపంచ నీటిపారుదల నిపుణులు కొనియాడుతున్నారు. ఇంతటి బృహత్తర ప్రాజెక్టుకు ఆయన అక్కడికి దగ్గరలో ఉన్న సుప్రసిద్ధ శైవక్షేత్రం కాళేశ్వరం పేరు పెట్టారు. బ్యారేజ్‌, రిజర్వేయర్లకు కూడా లక్ష్మీ సరస్వతీ సీతమ్మ వంటి పేర్లు పెట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఎన్నో ధర్మకార్యాలు నిర్వర్తించారు. యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ ఆలయాల పునర్నిర్మాణం చేపట్టారు. 

ఆలయాలకు పునర్వైభవం తేవడం, పుష్కర ఘాట్లను నిర్మించడం, అర్చకులను ఆదుకోవడం వంటివన్నీ ఆయన ఆధ్యాత్మిక గాఢతకు తార్కాణాలు. తెలంగాణ ప్రజలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకొనే బతుకమ్మ, బోనాల పండుగలను కేసీఆర్‌ ప్రభుత్వ పండుగలుగా ప్రకటించారు. పేద మహిళలందరికీ బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం చీరెలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఈ విధంగా కేసీఆర్‌ పరిపూర్ణుడైన హిందువు. హిందూమతం ప్రవచించిన దైవభక్తి, పెద్దలపట్ల గౌరవం, పండితుల, కళాకారుల పట్ల ఆదరాభిమానాలు, గురువులను గౌరవించడం వంటి సదాచారాలలో ఆయనకు సాటిరాగలవారు లేరు. దేశమాత గర్వించదగ్గ తెలంగాణ హిందూ బిడ్డ కేసీఆర్‌. తన బిడ్డ కేసీఆర్‌ను చూసి తెలంగాణ తల్లి గర్విస్తున్నది.

(వ్యాసకర్త: రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ )

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement