e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, April 18, 2021
Advertisement
Home News సంజ‌నా ట్వీట్‌తో బుమ్రా పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!

సంజ‌నా ట్వీట్‌తో బుమ్రా పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!

సంజ‌నా ట్వీట్‌తో బుమ్రా పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!

భార‌త పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా మ‌రికొద్ది రోజుల‌లో  ఓ ఇంటివాడు కాబోతున్న‌ట్టు కొన్నాళ్ళుగా ప్ర‌చారం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. కేర‌ళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను చేసుకోనున్నాడ‌ని మొద‌ట్లో వార్త‌లు రాగా, ఆ త‌ర్వాత స్పోర్ట్స్ కామెంటేట‌ర్ సంజ‌నా గ‌ణేష‌న్‌తో వివాహం జ‌ర‌గ‌నుంద‌ని చెప్పుకొచ్చారు. వీరిద్ద‌రి పెళ్లి జ‌ర‌గ‌డం ఖాయం అంటూ కొంద‌రు జోస్యాలు కూడా చెప్పారు.

సంజ‌నా గ‌ణేషన్ జ‌న‌వ‌రిలో .. బుమ్రా గురించి ఓ ట్వీట్ చేయ‌గా, ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్‌గా మారింది.  ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో బుమ్రా ప‌లు ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌గా, వీటిని ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో త‌న సోష‌ల్ మీడియాలో  కొలేజ్ రూపంలో షేర్ చేసింది. దీనికి మీ ఆదివారం బుమ్రా కంటే బాగా గ‌డిచిందా అనే కామెంట్ పెట్టారు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన సంజ‌న .. బుమ్రా ఆన్ ఫీల్డ్ మూడ్, డైలీ నా మూడ్ ఒకేలా ఉందంటూ కామెంట్ పెట్టింది. ఈ ట్వీట్ల ఆంత‌ర్యాన్ని గ‌మ‌నిస్తే ఇద్ద‌రు పెళ్లి చేసుకోవ‌డం ఖాయం అంటూ నెటిజన్స్ ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు శుభాకాంక్ష‌లు కూడా తెలియ‌జేస్తున్నారు.

Advertisement
సంజ‌నా ట్వీట్‌తో బుమ్రా పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement